వైట్ హనీ ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు

/ / 0 Comments / 10:58 pm
Health Benefits of White Honey

హనీ పేరు చెప్పగానే ఎవ్వరికైనా నోరూరిపోతుంది. ఎందుకంటే తేనెని ఇష్టపడనివారంటూ ఎవ్వరూ ఉండరు. అయితే మనం ఇప్పటివరకూ బ్రౌన్ కలర్ హనీని మాత్రమే చూసి ఉంటాం. కానీ, వైట్ కలర్ హనీని మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. నిజానికి రా-హనీనే వైట్ హనీ అనికూడా పిలుస్తారు.

హనీ బీస్ నుండి హనీ తీసిన తర్వాత ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా ఉపయోగించేదే ఈ వైట్ హనీ. తేనెని ప్రాసెసింగ్ చేసిన తర్వాత ప్రయోజనకరమైన అంశాలు తొలిగిపోతాయి. ఈ రకంగా చూస్తే, గోధుమ రంగు తేనె కంటే తెలుపు రంగులో ఉండే తేనెలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. 

ప్రతిరోజూ ఒక టీస్పూన్ వైట్ హనీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం. 

  • తెల్ల తేనెలో విటమిన్ A, B, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే దీనిని ‘యాంటీ ఆక్సిడెంట్స్ నిండిన పవర్ హౌస్’ అంటారు. అంతేకాక, తెల్ల తేనెలో ఇంకా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. ఇవి వృద్ధాప్యం రాకుండా సహాయపడతాయి. అలాగే, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
  • ముడి తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది గాయాలను త్వరగా మాన్పుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు, అందంగా ఉంచడంలోను హెల్ప్ అవుతుంది. ఇందులో ఫంగస్‌ను తొలగించే లక్షణాలు కూడా చాలా ఉన్నాయి.
  • వైట్ హనీ దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసం, గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వైట్ హానీ వేసి, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తాగితే దగ్గు తగ్గిపోతుంది. 
  • నోటిలో బొబ్బలు ఏర్పడితే ముడి తేనెని ఆ బొబ్బలపై  అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • ప్రతిరోజూ పరగడుపున ఒక స్పూన్ వైట్ హనీ తీసుకుంటే.. అల్సర్, కడుపు పూత వంటి సమస్యలేమైనా ఉంటే తగ్గిపోతాయి. అలాగే, జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. 
  • తెల్ల తేనెని ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
  • మహిళల్లో సాదారణంగా ఏర్పడే అనీమియా  నుంచి బయటపడతారు.

అయితే, మంచిదే కదా అని ఈ వైట్ హనీని ఎక్కువగా వాడితే నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనిని అతి కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే దీని ప్రయోజనాలని పొందగలరు. శరీరానికి కూడా ఎలాంటి హాని కలగదు. వాస్తవానికి, దీనిలో ఉండే మైక్రోబ్స్ కారణంగా కొన్నిసార్లు బోటులిజానికి కారణమవుతుంది. బోటులిజం వల్ల పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవేకాక, తెల్ల తేనెని అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ పెరుగుతుంది. ఇది చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇంకా ఫుడ్ పాయిజనింగ్ కి కారణమవుతుంది. అందుకే వన్ ఇయర్ లోపు పిల్లలు గానీ, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు గానీ ఈ వైట్ హనీని అస్సలు తీసుకోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Homemade Energy Drinks

సమ్మర్‌లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలుసమ్మర్‌లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలు

సమ్మర్ మొదలైంది… సన్ షైన్ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన చెమట పట్టి, ఆ చెమట రూపంలోనే లవణాలని ఎక్కువగా కోల్పోతుంటుంది మన శరీరం. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగాలని డాక్టర్లు

Health Benefits of Mustard Seeds

చిట్టి ఆవాలతో ప్రయోజనాలెన్నో! తెలిస్తే ఒదిలిపెట్టరు!!చిట్టి ఆవాలతో ప్రయోజనాలెన్నో! తెలిస్తే ఒదిలిపెట్టరు!!

ఆవ గింజ చూడటానికి ఇంతే ఉంటుంది, కానీ అది చేసే మేలు ఎంతో! మన వంటింటి పోపుల డబ్బాలో ఉండే పోపు దినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా

Health Benefits of Eating Rajma

రాజ్మా తినడం వలన శరీరంలో జరిగే అద్భుతాలివే!రాజ్మా తినడం వలన శరీరంలో జరిగే అద్భుతాలివే!

రాజ్మా అంటే చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కిడ్నీ బీన్స్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రంగులోనూ, రూపంలోనూ ఇది  మూత్రపిండాలని పోలి ఉంటుంది. అందుకే దీనిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాహారాలలో ఒకటి. అలానే,