అక్కినేని కోడలు అయ్యుండి… ఈ విలన్ వేషాలేంటి?

స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై తానేంటో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం పాత్రల్లో వైవిధ్యాన్ని కోరుకుంటుంది. 

హీరోయిన్ గానే కాకుండా లేడీ విలన్ గానూ అలరించనుంది. అందుకే ఇప్పటిదాకా పాజిటివ్ రోల్స్ తో అలరించిన సమంత ఇకపై నెగెటివ్ రోల్స్ కూడా చేయటానికి సిద్ధపడింది. ఈ క్రమంలోనే గ్లామర్ రోల్స్ ని పక్కన పెట్టి బోల్డ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ చేస్తూ… మద్య మద్యలో ఓటీటీ లోనూ అలరిస్తూ వస్తుంది.

అక్కినేని నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత కేవలం తన కేరీర్ పైనే ఫోకస్ పెట్టింది  సమంత. అందుకే క్రేజీ ప్రాజెక్ట్ లలో వర్క్ చేస్తోంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ చేసి ‘పుష్ఫ’తో తన సత్తా చాటిన ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు విలన్ గా మారిపోనుంది. 

తమిళ స్టార్ హీరో సినిమాలో లేడీ విలన్ గా  కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న ఫిల్మ్ ‘వారసుడు’.  ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా… సమంత విలన్ రోల్ చేస్తుంది.

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. ఇక తొలిసారిగా తమ అభిమాన హీరోయిన్ ఫుల్ లెంన్త్ లేడీ విలన్ గా కనిపించబోతుందనడంతో… అభిమానులు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు.