కేవలం 10 వేల లోపే లభించే అద్భుతమైన స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అదే టెక్నో స్పార్క్‌9. ఈ ఫోన్‌ ధర రూ. 9,499.

ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్:

 • ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ హెచ్‌డీ+ డాట్‌ డిస్‌ప్లేతో లభిస్తుంది.
 • మీడియా టెక్‌ హీలియో జీ37 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
 • ఇది ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ ని కలిగి ఉంది.
 • కెమెరా విషయానికొస్తే, ఇందులో 13 మెగా పిక్సెల్‌ రియిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. అలాగే, బ్యాక్‌ కెమెరాలో ఏఐ ఎన్‌హాన్స్‌డ్‌ ఇమేజ్‌ సిస్టమ్‌ తో రూపొందించబడి ఉంది.
 • 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో వర్క్ చేస్తుంది.
 • 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌, డీటీఎస్‌ స్పీకర్లు కలిగి ఉంది.
 • వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం.
 • ఇంకా 6 జీబీ  స్టోరేజ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలదు.
 • 512 జీబీ వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు.
 • అంతేకాదు, 5GB వర్చువల్ ర్యామ్‌ ని కూడా అందిస్తుంది.
 • ఈ ఫోన్లు ఇన్‌ఫినిటీ బ్లాక్‌, స్కై మిర్ర‌ర్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయి.
 • ఈ Tecno Spark 9 మొబైల్స్ సేల్స్ జులై 23 నుంచి అమెజాన్‌లో ప్రారంభం కానున్నాయి.