సమ్మర్‌లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలు

సమ్మర్ మొదలైంది… సన్ షైన్ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన చెమట పట్టి, ఆ చెమట రూపంలోనే లవణాలని ఎక్కువగా కోల్పోతుంటుంది మన శరీరం. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల బాడీ హెల్దీగా ఉండటమే కాకుండా.. తొందరగా అలిసిపోకుండా ఉంటారు. 

అయితే, కేవలం వాటర్ మాత్రమే కాకుండా బాడీకి ఎనర్జీని కూడా అందించేవి కూడా అయితే మరీ మంచిది. అందుకే ఈ టైమ్ లో ఫ్రూట్ జ్యూస్ లని ట్రై చేసినట్లయితే, శరీరానికి కావాల్సిన వాటర్ పర్సెంటేజ్ పెరగటమే కాకుండా.. శరీరానికి కావాల్సిన మూలకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందుతాయి. ఇవి మెటబాలిజాన్ని పెంచడంతో పాటు ఇన్స్టంట్ ఎనర్జీని కూడా అందిస్తాయి.

అలాంటి ఫ్రూట్స్ లో తర్భూజ, పుచ్చకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, పచ్చిమామిడి కాయ, మజ్జిగ-పుదీనా రసం మొదలైనవి. వీటిని తీసుకోవడం వల్ల రోజంతా నీరసం లేకుండా.. ఎంతో ఎనర్జిటిక్ గా..  ఉంటుంది. మరి వీటివల్ల ఏమేమి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దామా!

  • ముఖ్యంగా నిమ్మకాయ, పచ్చిమామిడి జ్యూస్‌తో పొటాషియం, ఎ, బి6, బి1, బి2, సి విటమిన్స్ లభ్యమవుతాయి.
  • ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎండ వేడికి వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు.
  • కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
  • మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
  • చర్మానికి నూతన యవ్వనం లభిస్తుంది.
  • పళ్ళ రసాలు తాగటం వల్ల పేగులకు చాలా మంచి చేస్తుంది.
  • ఎసిడిటీ, అలర్స్ తగ్గుముఖం పడతాయి.
  • అజీర్తి కూడా తగ్గుముఖం పడుతుంది.

కాబట్టి ఇకనైనా కూల్ డ్రింక్స్ ని పక్కనపెట్టి ఇలాంటి హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్ లని తీసుకోండి.  ఇన్స్టంట్ ఎనర్జీని పొందండి.