చిట్టి ఆవాలతో ప్రయోజనాలెన్నో! తెలిస్తే ఒదిలిపెట్టరు!!

ఆవ గింజ చూడటానికి ఇంతే ఉంటుంది, కానీ అది చేసే మేలు ఎంతో! మన వంటింటి పోపుల డబ్బాలో ఉండే పోపు దినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

ఆవాలలో క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాక,  విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, పొటాషియం, సోడియం, డైటరీ ఫాట్స్, బీటా కెరోటిన్ వంటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఆవాలు ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* ప్రతిరోజూ నాలుగు గ్రాముల ఆవాలను తినటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. 

* ఆవాలకి శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టి, ఎక్స్ట్రా ఫ్యాట్ ని తగ్గించే గుణం ఉంది.

* ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పికి  ఉన్నచోట రాస్తే తలనొప్పి పోతుంది. అంతేకాదు, ఇది మైగ్రేన్ నొప్పికి కూడా మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది.

* ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.

* రోజూ పరగడుపున ఆవాలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.

* ఆవాల ముద్దను, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవ పొడి తొలగిస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమంలా చేసి దాన్ని  పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి.

* ఆవాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంఛి, రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి.

* వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకొంటే… తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

* కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుంది.

* గొంతునొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, కొద్దిగా తేనె వేసి తీసుకుంటే చాలా మేలు చేస్తుంది.

* జుట్టు రాలిపోవటం, బట్టతల ఏర్పడటం కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల నూనెతో కలిపి రాస్తే..మళ్లీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి.

అందుకే అంటారు చిట్టి ఆవాలు… ఎట్టి రోగాన్నైనా తగ్గిస్తుందని. అందుకే,  ఆవాలను ఇక అంత తేలిగ్గా తీసి పారేయకండి!