What is a Bluetooth Beanie

What is a Bluetooth Beanie

కూల్ కూల్ వింటర్ లో హాట్ హాట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ గడిపేయాలని ఎవరికుండదు చెప్పండి! అలాంటి మ్యూజిక్ ప్రియుల కోసమే ఈ సరికొత్త గాడ్జెట్.

మిడ్ వింటర్‌లో ఉన్నాం. బయటకు వెళ్ళాలంటే వెచ్చటి వింటర్ క్యాప్ తప్పనిసరి. అలాంటప్పుడు చెవుల్లో ఇయర్ బడ్స్, లేదా బ్లూటూత్ పెట్టుకొని మ్యూజిక్ వినాలంటే కష్టమే! అలాంటి వారికోసమే మార్కెట్లో సరికొత్త మ్యూజిక్ క్యాప్స్ వచ్చేశాయి.  ఈ క్యాప్స్ పెట్టుకుంటే చాలు చలిలో కూడా మ్యూజిక్ వింటూ ఎంతదూరమైనా  వెళ్లిపోవచ్చు.

బ్లూటూత్ మ్యూజిక్ క్యాప్/హ్యాట్ ప్రత్యేకతలు:

ఇప్పటివరకూ మనం చెప్పుకొంటున్న ఈ గాడ్జెట్ పేరు ‘బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్/ఫ్యాషన్ హ్యాట్’. వింటర్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ క్యాప్ కేవలం చలినుండీ కాపాడటానికి, మరియు మ్యూజిక్ వినటానికి మాత్రమే కాదు; ఇంకా అనేక ఫీచర్స్ ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. 

బ్లూటూత్ మ్యూజిక్ క్యాప్/హ్యాట్ ఫీచర్స్:

ఈ క్యాప్‌లో ఆల్రెడీ కంట్రోల్ ప్యానెల్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇంకా మ్యూజిక్ ని వినటానికి వీలయ్యే విధంగా అద్భుతమైన స్పీకర్లు ఉన్నాయి. వీటిద్వారా వాల్యూమ్‌ను ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్‌ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. 

ఇక ఈ బ్లూటూత్ మ్యూజిక్ క్యాప్ లో అనేక రంగులు, మరియు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆన్‌లైన్ స్టోర్స్ లోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర  సూమారు రూ. 3499 వరకు ఉన్నాయి. ఇవి ఇప్పుడు మార్కెట్లో హాట్ కేక్స్‌లా అమ్ముడు పోతున్నాయి. వెచ్చటి టోపీలో చక్కటి సంగీతం మీ మనసుని మైమరపింప చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే కొనేయండి.