కరోనా మహమ్మారి పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మొత్తం ఆర్దికవ్యవస్థే చిన్నాభిన్నం అయిపొయింది. ఈ నేపద్యంలో ఉన్న ఆదాయం సరిపోవడం లేదు. మరి అలాంటప్పుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించక తప్పదు. ఈ క్రమంలోనే ‘వర్క్ ఫ్రమ్ హోం’ పేరిట ఆన్లైన్ లో చాలా ఇన్కమ్ సోర్సెస్ కనిపిస్తున్నాయి. కానీ, వీటన్నిటికంటే ఒక బెటర్ ఆప్షన్ ని మీకు అందిద్దామనే ఉద్దేశ్యంతో నేనీ వీడియో చేస్తున్నాను.
ప్రతి నెలా అదనపు ఆదాయం కోరుకునేవారికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనిద్వారా నెలకి రూ.50 వేల దాకా సంపాయించవచ్చు. అయితే దీనికి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇంతకీ ఏమిటా బిజినెస్ అంటే… ఏటీఎం బిజినెస్. దీని ద్వారా మంచి రాబడి పొందవచ్చు. అందుకోసం ముందుగా ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవాలి. టాటా ఇండీక్యాష్, హిటాచి, ముత్తూట్, ఇండియా1 వంటి వివిధ కంపెనీలు ఈ ఏటీఎం ఫ్రాంచైజీ సర్వీసులని ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో మీకు నచ్చిన ఏటీఎం ఫ్రాంచైజీని తీసుకోవచ్చు.
ఇందుకోసం ముందుగా మీ టౌన్‌లో ఒక మంచి సెంటర్ చూసుకొని అక్కడ ఏటీఎం ఏర్పాటు చేయాలి. అందుకోసం సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో రూ.2 లక్షలు రిఫండ్ అవుతాయి. మిగిలిన రూ.3 లక్షలు ఏటీఎంలో ఉంచాలి. అలా ఉంచిన రూ.3 లక్షలను రొటేషన్ చేస్తూ ఉండాలి. ఇక కస్టమర్ ఏటీఎంని యూజ్ చేసిన ప్రతిసారీ… మీ కరెంట్ అకౌంట్‌కు ఆ మొత్తం రిఫండ్ అవుతాయి. ఈ డబ్బులు మీ బ్యాంక్ నుంచి తీసుకొని… మళ్లీ ఏటీఎంలో పెట్టాలి. ఇలా రొటేషన్ చేస్తుండాలి.
ఇక ఏటీఎం ద్వారా కస్టమర్లు చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు కమిషన్ వస్తుంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ పై రూ.8, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై రూ.2 కమిషన్ వస్తుంది. ఏటీఎం ద్వారా రోజుకు 250 ట్రాన్సాక్షన్లు జరిగినట్లయితే… మీకు నెలకు రూ.50 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లైతే… మరింత ఆదాయం వస్తుంది.