వర్షాకాలం వచ్చిందంటే చాలు… అనారోగ్య సమస్యలు మనకి వెల్కమ్ చెప్తుంటాయి. వానలు ఎక్కువగా పడుతూ ఉండడంతో… వాతావరణం మారడం, దోమలు ఎక్కువగా చేరడం, సీజనల్ వ్యాధులు రావడానికి దారితీస్తాయి. ఈ కాలంలో గాలి ద్వారా, మరియు నీటి ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఎక్కువగా కలరా, డయేరియా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా, మరియు ఇతర వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే మంచి పోషకాహారం తీసుకుంటూ… తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఏదేమైనా వర్షాకాలంలో ఎక్కువ హైజెనిక్ గా ఉండటమే మంచిది.
ఇదంతా నిన్నమొన్నటివరకు. కానీ ఇప్పుడలా కాదు, వీటికి తోడు కరోనా కూడా వచ్చిచేరింది. మిగతా అనారోగ్యాలనుండీ కోలుకోవటం ఈజీనే కానీ, కరోనా నుండి కోలుకోవడం మాత్రం కొంచెం కష్టంమే! ఈ నేపధ్యంలో కరోనా కారణంగా వచ్చే జ్వరానికి, సాదారణ జ్వరానికి మధ్య గల తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం.
వైరల్ ఫీవర్:
అలసటగా ఉండటం, వీక్ గా ఉండటం, జాయింట్ పెయిన్స్ రావటం, ఆకలి లేకపోవడం, చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ ఇవన్నీ వైరల్ ఫీవర్ యొక్క లక్షణాలు.
మలేరియా:
మలేరియా వచ్చిందంటే చాలు, ఒక రోజు లేదా అంత కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటుంది. అదే విధంగా ఒళ్ళు నొప్పులు, బాడీలో వణుకు పుట్టడం, చెమటలు కారడం, డయేరియా, మెంటల్ కన్ఫ్యూజన్, గుండె వేగంగా కొట్టుకోవడం ఇవన్నీ మలేరియా యొక్క లక్షణాలు.
డెంగ్యూ:
జ్వరం, వికారం, వాంతులు, ఒళ్ళు నొప్పులు, కంటి నొప్పి, ర్యాషెస్, జాయింట్ పెయిన్స్, రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇవన్నీ డెంగ్యూ యొక్క లక్షణాలు.
చికెన్ గున్యా:
టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, నీరసం, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చికెన్ గున్యా యొక్క లక్షణాలు.
కరోనా:
జ్వరం, దగ్గు, తలనొప్పి, చెస్ట్ పెయిన్, రెస్పిరేటరీ ప్రాబ్లెమ్స్, అలసిపోవడం, వేళ్ళు రంగు మారిపోవడం, రుచి, వాసన తెలియక పోవడం ఇవన్నీ కరోనా యొక్క లక్షణాలు.
పైన పేర్కొన్న సమస్యలలో మీకు ఏ సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తే ఆ ఫీవర్ గా గుర్తించాలి. అంతేకానీ, అన్ని ఫీవర్లు కరోనాకి దారితీయవు.