స్టార్టప్స్ కి రూ.10 లక్షలు లోన్ ఆఫర్ చేస్తున్న ప్రధాని మోదీ

4

కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్టార్టప్స్ కి మోదీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ని అందించాలని భావించింది. అందుకోసం ఓ సరికొత్త స్కీమ్ ని అందుబాటులో ఉంచింది. దాని పేరే ‘ముద్రా యోజన’. ఈ స్కీమ్ కింద బిజినెస్ చేయాలని భావించే వారెవరైనా సరే  లోన్ పొందొచ్చు. 

కొత్తగా వ్యాపారం చేయాలన్నా… లేక ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలన్నా… ముద్రా స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. ఈ స్కీమ్ ద్వారా సుమారు రూ.10 లక్షల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా ఈ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. బ్యాంక్ ప్రాతిపదికని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ముద్రా లోన్‌పై కనీస వడ్డీ రేటు 12% నుంచి ఉంటుంది. 

అయితే, ముద్రా స్కీమ్ లో మూడు కేటగిరిలు ఉంటాయి. శిశు, కిశోర్, తరుణ్ అనేవి లోన్ కేటగిరిలు. కేటగిరీని బట్టి… లభించే లోన్ మొత్తం మారుతుంది. శిశు కేటగిరీ కింద రూ.50 వేల వరకు, కిశోర్ కేటగిరీ  కింద రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఈ లోన్ ని  బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ద్వారా పొందవచ్చు. అలాకాకపోతే, ఆన్‌లైన్‌లో http://www.mudra.org.in  వెబ్‌సైట్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబులిటీని బట్టి లోన్ వస్తుందా? రాదా? అనే అంశం తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

1 2

ప్రతి నెలా అదనంగా రూ.50 వేలు సంపాదించే బిజినెస్ ఐడియా!ప్రతి నెలా అదనంగా రూ.50 వేలు సంపాదించే బిజినెస్ ఐడియా!

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మొత్తం ఆర్దికవ్యవస్థే చిన్నాభిన్నం అయిపొయింది. ఈ నేపద్యంలో ఉన్న ఆదాయం సరిపోవడం లేదు. మరి అలాంటప్పుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించక తప్పదు. ఈ క్రమంలోనే ‘వర్క్ ఫ్రమ్

1 1

BEL Recruitment 2021: Bharat Electronics Limited Invites Job Application from Eligible CandidatesBEL Recruitment 2021: Bharat Electronics Limited Invites Job Application from Eligible Candidates

ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ అఫ్  డిఫెన్స్ కి చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కంపెనీ జాబ్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ యొక్క హైదరాబాద్‌ యూనిట్‌లో ఖాళీగా ఉన్న 49 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, మరియు ఇతర