యోగి వేమన బట్టలు ధరించకపోవడానికి అసలు కారణం ఇదే!

సాహిత్యంలో వేమన శతకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని వారంటూ ఎవ్వరూ ఉండరు. మనకి తెలిసినంతవరకూ వేమన జీవితం గురించి సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ, నిజ జీవితంలో వేమన ఎలా ఉండేవారు. ఆయన యోగి వేమనగా మారడానికి గల కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. 

వేమన తన గురువు విశ్వకర్మయోగి దగ్గర విద్యని అభ్యసిస్తాడు. వేమన పద్యాలన్నీ లోక నీతులు. వీటిలో సామాజిక చైతన్యానికి సంబందించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ఉన్న సమస్యలన్నిటినీ  భిన్న కోణాల్లో చూసి… దానినే వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. ఈ పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని మంచి ఉదాహరణలతో, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాడు వేమన. 

వేమన చెప్పే పద్యాల్లో మొదటి రెండు పాదాల్లో ఎంతో నీతిని తెలియచేసి, మూడో పాదంలో దానికి తగ్గ పోలికని చెప్తాడు. ఇక నాలుగో పాదంలో  “విశ్వదాభిరామ వినుర వేమ” అనేది  కామన్ గా ఉంటుంది. ఈ విశ్వదాభిరామ వినుర వేమ అనే పదానికి రెండు అర్ధాలున్నాయి. 

మొదటిది:

వేమన ఆలనా పాలనా చూసుకొన్నది ఆయన వదిన అయినటువంటి  విశ్వద. ఇక ఆయనకి అభిరాముడు అనే ఆప్తమిత్రుడు ఉండేవాడు. వీరిద్దరినీ కలిపి తన పద్యంలో నాలుగో పాదంలో చేర్చి… వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని చెప్తారు. 

రెండవది:

విశ్వద అంటే… విశ్వకారకుడికి, అభిరామ అంటే… ప్రియమైనవాడని. అంటే… సృష్టికర్తకి ప్రియమైన వేమా… వినుము అని మరో అర్థం చెప్పారు.

ఇక వేమన ఈ పద్యాలని పాడుతూ… యోగి వేమనగా మారి… దిగంబరంగా దుస్తులు త్యజింఛి… ఒక చెట్టుకింద కూర్చుని ఉండేవాడని చెప్తుంటారు. ఇకపోతే, వేమన బట్టలు ధరించకపోవడం వెనుక ఒక కారణం ఉంది. దానిని ఆయన పద్యం రూపంలో ఇలా చెప్పాడు. తల్లి గర్భంలోనుండీ బయటకి వచ్చేటప్పుడు బట్ట కట్టలేదు, చివరికి కాటికి పోయేటప్పుడు బట్ట కట్టలేదు, మరి మద్యలో ఈ బట్టలెందుకు? అని చెప్పారు. 

దీన్నిబట్టి చూస్తే…  వేమ‌న నిజంగానే బట్టలు ధరించలేదేమో..! అనే సందేహం కలుగుతుంది. కానీ, వేమన పద్యాలపై స్టడీ చేసిన ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్… వేమన ఓ దిగంబ‌రుడ‌ని ఎక్కడా  పేర్కొన‌లేదు. అంతేకాదు, వేమన అసలు బట్టలు ధరించడు అనే విషయంపై ఇప్పటికీ సరైన క్లాారిటీ లేదు.