`వాల్తేర్‌ వీరయ్య` నుంచి చిరు లీక్‌ (వీడియో)

Chiranjeevi Leaked New Song from Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ `వాల్తేర్‌ వీరయ్య`. ఈ మూవీకి సంబందించిన కొన్ని సన్నివేశాలని ఫ్రాన్స్ లో చిత్రీకరిస్తున్నారు. అందుకోసం గత వారం చిరంజీవి, శృతి హాసన్‌తోపాటు చిత్ర యూనిట్ కూడా అక్కడికి వెళ్ళింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే వెల్లడించారు.

అయితే ఇటీవలికాలంలో చిరు తన లేటెస్ట్ మూవీ అప్‌డేట్లు లీక్‌ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో లీక్‌ ఇచ్చారు. అదే వాల్తేర్‌ వీరయ్యలోని మరో సాంగ్.

ఫ్రాన్స్ లో జరుగుతున్న షూటింగ్‌ లో భాగంగా ఈ సాంగ్ ని కూడా షూట్ చేయటం జరిగింది. `నువ్వు శ్రీదేవైతే, నేను చిరంజీవి` అంటూ సాగే ఈ పాటని చిరంజీవి, శృతి హాసన్‌ ల చిత్రీకరించటం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్‌ పాడిన ఈ పాట మాస్‌ బీట్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ పాటని చిరు సైలెంట్‌గా లీక్ చేసేశారు.

అంతేకాదు, అక్కడ అందాలను ఆయన ప్రత్యేకంగా వీడియో తీసి మరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేశారు. ఫ్రాన్స్ లోని అందాలను చూసి తాను ఎగ్జైట్‌ అయ్యారట. అందుకే ఇదంతా తన ఫ్యాన్స్ తో పంచుకోవాలని ముచ్చట పడి వెంటనే షేర్‌ చేశారు.

ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ, నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. శృతి హాసన్‌తో ఇక్కడ ఓ సాంగ్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఇప్పుడు మీతో షేర్‌ చేసుకోవడానికి కారణం ఏంటంటే… అది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇక్కడి విజువల్స్ గానీ, సాంగ్‌ గానీ, మేం చేసిన లొకేషన్లు గానీ రియల్లీ బ్యూటిఫుల్‌.

సౌత్‌ ఆఫ్‌ ఫ్రాన్స్ లో ఈ లొకేషన్‌ ఉంది. స్విట్జర్లాండ్‌, ఇటలీ బార్డర్‌లో ఉన్న ఆర్బ్స్ మౌంటేన్‌ లోయలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆ లోయ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక దాని అందం అంతా ఇంతా కాదు. నాకైతే చాలా బాగా నచ్చింది.

మైనస్‌ 8 డిగ్రీల చలిలో డాన్సు చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ మిమ్మల్ని అలరించడానికి అదేమంత కష్టం అనిపించలేదు. టీమ్‌ మొత్తం చాలా కష్టపడ్డారు. దాని ఫలితం బాగా వచ్చిందని నమ్ముతున్నాం.

నేను ఇదంతా ఆపుకోలేక మీతో పంచుకోవాలనిపించింది. అందుకే నేనే స్వయంగా ఈ అందమైన విజువల్స్ ని క్యాప్చర్ చేసి మీ కోసం పంపిస్తున్నా. మీరు కూడా దానిని చూసి ఆనందిస్తారనిపించింది. త్వరలో లిరికల్‌ వీడియో మీ ముందుకు రాబోతుంది. అయితే ఈ సాంగ్‌కి సంబంధించిన ఓ చిన్న బిట్‌ని ఇప్పుడు లీక్‌ చేస్తున్నా అంటూ చిరు లీక్‌ చేశాడు చిరు.

చిరంజీవి సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇంకా రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని యూరప్‌లో చిత్రీకరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాని అన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

LEO Bloody Sweet Movie Promo

LEO Bloody Sweet Movie Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | AnirudhLEO Bloody Sweet Movie Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh

LEO Bloody Sweet Movie Promo  లోకేష్ యొక్క మునుపటి చిత్రం విక్రమ్ యొక్క టైటిల్ రివీల్ ప్రోమోలో ఒకదానిని తక్షణమే గుర్తుకు తెచ్చే లియో యొక్క రెండు నిమిషాల ప్రోమో వీడియో, విజయ్ చాక్లెట్ తయారు చేస్తున్నప్పుడు మరియు ఏకకాలంలో

Matching Matching Telugu Video Song

Matching Matching Telugu Video Song | Suryapet Junction Movie | Eeswar | Keethana Sharma | Gowrahari | Item SongMatching Matching Telugu Video Song | Suryapet Junction Movie | Eeswar | Keethana Sharma | Gowrahari | Item Song

యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ తాజా తెలుగు రాబోయే చిత్రం సూర్యాపేట జంక్షన్ లిరికల్ సాంగ్ ” మ్యాచింగ్ మ్యాచింగ్ ” కీర్తన శర్మ, గౌరహరి, సంగీతం & సాహిత్యం గౌరహరి పాడారు.