‘సెంగోల్’ అంటే ఏమిటి? కొత్త పార్లమెంట్‌లో దీనిని ఎందుకు ప్రతిష్టించనున్నారు?

/ / 0 Comments / 6:31 pm
Origin of Sengol

భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో  రూపుదిద్దుకున్న పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ భవనం ప్రారంభించబడుతుంది. 

కొత్త పార్లమెంట్  ప్రత్యేకతలు

అయితే ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎన్నో వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు వుండేలా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే ‘సెంగోల్’ ని ప్రతిష్టించాలని నిర్ణయించుకుంది. దీంతో కొత్త పార్లమెంట్ లో సెంగోల్ ‘సెంటర్ అఫ్ అట్రాక్షన్‌’ గా నిలవ బోతుంది. అంతేకాదు, ఇప్పుడు ఎవరి నోట విన్నా సెంగోల్ మాటే! ఇంతకీ ఏమిటా సెంగోల్… దాని ప్రత్యేకత ఏంటి? దానిని కొత్త పార్లమెంట్ లో ఎందుకు ప్రతిష్టించాలని అనుకొంటున్నారు?

సెంగోల్ అంటే ఏమిటి?

నిజానికి సెంగోల్ అంటే – “సింబల్ అఫ్ పవర్ ఎక్స్చేంజ్”. ఇది ప్రపంచవ్యాప్తంగా శాసన సభల పనితీరును విప్లవాత్మకంగా మారుస్తుంది. భారత రాజకీయాలన్నీ  సెంగోల్ శాసన నిర్ణయాధికారం చుట్టూ తిరుగుతాయి. చట్టసభ సభ్యులు శక్తివంతమైన చర్చలలో పాల్గొనడానికి, విధానపరమైన విషయాలను చర్చించడానికి, మరియు వారి రాజ్యాంగ విధులను నిర్వహించడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది.

సెంగోల్ ఎలా పుట్టింది?

సెంగోల్ అనే పదం తమిళ భాషలోని ‘సెమ్మై’ నుంచి పుట్టిందట. క్రమేపీ అది సెంగోల్ గా మారింది. 

చారిత్రక ప్రాముఖ్యత

సెంగోల్ గురించి తెలుసుకోవాలంటే… మనదేశానికి స్వాతంత్రం  వచ్చిన సమయానికి వెళ్లాలి. బ్రిటీష్‌వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత అధికారాన్ని మార్పిడి చేయడానికి గుర్తుగా ఏదో ఒక  సాంస్కృతిక విధానాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం అప్పటి గవర్నర్ జనరల్ నెహ్రూను సంప్రదించారట. అయితే నెహ్రూ ఆ బాధ్యతల్ని రాజీజీకి అప్పగించారట. 

ఆయన ఎంతోమందిని సంప్రదించిన అనంతరం అధికార మార్పిడి కోసం ప్రత్యేకంగా ఓ రాజదండం (సెంగోల్) తయారు చేయించాలని నిర్ణయించారట. అందుకోసం  తమిళనాడులోని తిరువడుత్తురై మఠాన్ని సంప్రదించారట. 

రాజాజీ అభ్యర్ధనని అంగీకరించిన తిరువడుత్తురై మఠాధిపతులు చెన్నైకి చెందిన ఓ స్వర్ణకారుడి చేత దానిని తయారు చేయించారట. మొత్తం రాజదండాన్ని వెండితో తయారు చేసి దానిపై బంగారు పూత పూశారు. సింహ భాగంలో న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని ఉంచారు. 

తయారీ పూర్తయిన తర్వాత తిరువడుత్తురై మఠానికి చెందిన స్వామిజీ.. ఆ రాజ దండాన్ని 1947 ఆగస్ట్ 14న రాత్రి మౌంట్‌బాటన్‌కు అప్పగించారు. మళ్ళీ దానిని వెంటనే వెనక్కి తీసుకొని గంగాజలంతో శుద్ధి చేశారు. అనంతరం నెహ్రూ దగ్గరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆంగ్లేయులు స్వాతంత్రం ప్రకటించటానికి 15 నిమిషాల ముందు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ అప్పటి తొలి ప్రధాని అయిన జవహర్‌లాల్ నెహ్రూకి ఈ రాజదండం(సెంగోల్) ని అందచేశారట. అంతేకాదు, ఆ సమయంలో ఓ ప్రత్యేక పాటను కూడా ఆలపించారట. ఈ ఘట్టాన్ని ఆ రోజుల్లోనే జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించిందట. 

భారతీయ రాజకీయాలలో సెంగోల్ పాత్ర 

8వ శతాబ్ధంలో తమిళనాడును పాలించిన చోళులు ఈ రాజదండాన్ని అందుకుని ప్రజలకు న్యాయమైన, నిష్పక్షపాతమైన పాలనను అందించారు. వీరి హయాంలో ఈ రాజదండం చేతులు మారడం ద్వారా అధికార మార్పిడి జరిగేది. 

సెంగోల్‌ తర్వాత ఏమైంది?

1947లో కొన్ని రోజుల పాటు జనం నోట్లో నానిన ఈ సెంగోల్ ప్రస్తావన క్రమేపీ మాయమైంది. అనంతరం ఈ రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. 

దాదాపు 31 ఏళ్ల తర్వాత అంటే… 1978 ఆగస్ట్ 15న కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి తన శిష్యుడైన డాక్టర్ బీఆర్ సుబ్రహ్మణ్యంకు దీని గురించి చెప్పారట. ఆయన దానిని తన పుస్తకంలో ప్రస్తావించారు. 

సెంగోల్ యొక్క ప్రయోజనాలు

భారతదేశం కొత్త పాలనా యుగంలోకి అడుగుపెట్టినప్పుడు సెంగోల్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముందుగా, ఇది హై ఎఫిషియన్సీ, మరియు ప్రొడక్టివిటీని వాగ్దానం చేస్తుంది, చట్టసభ సభ్యులు జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ఎక్కువ సమర్థతతో చర్చించేందుకు వీలు కల్పిస్తుంది. రెండవది, సెంగోల్ ఆధునిక ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. చివరగా, ఇది  ప్రజలకు కేంద్రీకృత విధానం, పౌరులకు శాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనడానికి అధికారం ఇస్తుంది. తద్వారా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తుంది.

సెంగోల్ ప్రతిష్ఠాపన

సెంగోల్ యొక్క గొప్పదనం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ దానిని కొత్త పార్లమెంట్ లో వుంచాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ భవనం అధికారిక ప్రారంభోత్సవానికి ముందు మోడీ ఢిల్లీ జాతీయ మ్యూజియంలో వున్న ఈ సెంగోల్‌ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితులతో కలిసి సంప్రదాయబద్ధంగా తీసుకువస్తారు. అనంతరం దానిని వేద మంత్రాల నడుమ స్పీకర్ సీటు వద్ద ప్రతిష్టిస్తారు. 

స్యాతంత్ర సమరయోధులకు పిలుపు

1947 ఆగస్టు 14న  దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ సెంగోల్ ని స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న 96 ఏళ్ల వుమ్మిడి బంగారు చెట్టి అనే స్వాతంత్ర సమరయోధుడు కూడా ఈ సెంగోల్ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 

కొత్త పార్లమెంటులతో ఎందుకు ప్రత్యేకమైనది?

భారతదేశం యొక్క కొత్త పార్లమెంట్ దాని ప్రపంచ ప్రత్యర్ధులలో ప్రత్యేకమైనది, దానికదే ప్రత్యేకత కలిగి ఉంది. పరిపాలన నీతి, న్యాయం, కర్తవ్యంతో సాగాలన్న సందేశాన్ని ప్రజలకు , ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే  సెంగోల్ ని పార్లమెంట్ లో ప్రతిష్టించేందుకు నిర్ణయించుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *