అందానికే అసూయ పుట్టే అందం ఆమెది. ఆ అందం పేరే అనసూయ. ఈ బ్యూటీ పుట్టినరోజు ఈరోజు. ముందుగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు.  

స్టార్ యాంకర్, మరియు యాక్ట్రెస్ అనసూయ బర్త్ డే నేడు. మే 15,1985లో అనసూయ జన్మించారు. అంటే ఈరోజు అనసూయ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నారు. అనసూయకు ఇంత వయసంటే నమ్మడం కష్టమే అయినప్పటికీ కఠిన కసరత్తులు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నారు.

మొదట్లో న్యూస్ రీడర్ గా, కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ గా వర్క్ చేసిన అనసుయకి జబర్దస్త్ కామెడీ షో ఆమె దశని మార్చేసింది.

ఈ షో సక్సెస్ కావడంతో అనసూయకు మంచి పాపులారిటీ వచ్చింది. దానితో పాటే బోల్డ్ యాంకర్ అని పేరు కూడా తెచ్చుకుంది.

ఆ క్రేజ్ తోనే నటిగా మారేందుకు వరుసగా వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంది. మొదట్లో నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు.

ఈ క్రమంలో రంగస్థలం మూవీ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. అనంతరం పుష్ప మూవీలో ఆమెకు మరో క్రేజీ రోల్ లభించింది. ఇప్పుడు పుష్ప 2లో సైతం అనసూయ సందడి చేయనుంది.

టాలెంటెడ్ యాక్టర్ ఎప్పుడూ ఛాలెంజింగ్ పాత్రల కోసం అన్వేషణలో ఉంటుంది. అలాగే  వాటిని ఎంచుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

సరిగ్గా ఇదే ట్రిక్ ప్లే చేసింది అనసూయ. తనలో ఉన్న టాలెంట్ మొత్తం వ్యక్తపరిచేటటువంటి పాత్రలను ఎంచుకొంది.

ఎవరేమనుకున్నా సరే డోంట్ కేర్ అంటూ తన స్టైల్ లో ముందుకెళుతూ స్టార్ హీరోయిన్లకి సైతం గట్టి పోటీనిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు స్టార్ హీరోలకి కూడా ఛాలెంజ్ విసిరింది.