మనదేశంలో బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో ప్రతిరోజూ మనం గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటాం. అంతేకాదు, గోల్డ్ రేట్లను అప్ టూ డేట్ తెలుసుకొంటూనే ఉంటాం.
కానీ బంగారానికి ప్రామాణిక ధర లేదు. ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అయితే ప్రాంతాలను బట్టి దీని ధర నిర్ణయించబడుతుంది.
మన దేశం మొత్తంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే రాష్ట్రం కేరళ. కేరళలోని మలబారు మరియు తిరువనంతపురం వంటి జిల్లాల్లో గోల్డ్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి.
ప్రాచీన కాలం నుంచి కూడా కేరళ రాష్ట్రం విదేశాలతో ట్రేడింగ్ రిలేషన్ షిప్ కలిగి ఉంది. అందుకే కేరళలో అతి తక్కువ ధరకే బంగారం లభిస్తుంది.
కేరళ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కూడా అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తారు. అందుకే ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలోనే బంగారం చీపెస్ట్ గా దొరుకుతుంది.
చెన్నై కేంద్రంగా అనేక జ్యువెలర్స్ దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాయి. ఇవి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లను అందుకున్నాయి.
తమిళనాడు తర్వాత ఆ స్థానాన్ని కర్ణాటక తీసుకొంది. కర్ణాటకలో కూడా అతి తక్కువ ధరలకే బంగారం లభిస్తుంది. మొత్తం మీద ఈ మూడు సౌత్ ఇండియన్ స్టేట్స్ లోనూ బంగారం ధర తక్కువే.
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ బంగారం వినియోగం తక్కువేమీ కాదు, పెద్ద మొత్తంలో బంగారు నగలను కొనుగోలు చేయాలంటే ఈ ప్రాంతం బెటర్.
ఆంద్ర రాష్ట్రంలో నెల్లూరు ప్రొద్దుటూరు మార్కెట్ మిగతా ప్రాంతాలతో పోలిస్తే నాణ్యతతోనూ, ధరకు తగ్గట్టుగానూ లభిస్తుంది.
ఫైనల్ గా చెప్పాలంటే ఉత్తరాదిలో బంగారం వినియోగం తక్కువ కాబట్టి అక్కడ ధర ఎక్కువ. ఇక దక్షిణాదిలో దీని వినియోగం ఎక్కువ కాబట్టి ఇక్కడ ధర తక్కువ.